⚡⚡ ఆరోగ్య మెరుపులు ⚡⚡

⚡⚡ ఆరోగ్య మెరుపులు ⚡⚡
—————————————————

ఆరోగ్యం ఉండాలంటే
వ్యాయమం చేయ్యాలి
భాగ్యం ఉండాలంటే
కష్టం చేయ్యాలి !! 656

విష పదార్థాలతో
విందులు ఎందుకు
ఆల్కాహాల్ లతో
ఆరోగ్యం పాడెందుకు !! 657

కోట్లున్నయని కరోనా
వదిలి పెడుతుందా
చేస్తుంది హైరానా
ప్రాణంపోనిది ఒదులుతుందా !! 658

పొద్దుగాల నడక
మంచి ఆరోగ్యమిచ్చు
త్వరగా పడక
దేహ ధారుడ్యమిచ్చు !! 659

గొంతు ఎండకుండ
తాగాలి నీరెపుడైన
కడుపు మండకుండ
తినాలి అన్నమెపుడైన !! 660

ఎక్కువ నీరు
శరీరానికి అందం
కొట్టదు బోరు
నడకే అందం !! 661

ప్రాణం వుంటేనే
తిండి బాధ
మనిషే లేకుంటే
కన్నీటి రోధ !! 662

మనిషికి తెలిసింది
డబ్బుతో రక్షణలేదని
మనసుకు తెలిసింది
బంధంలేనిది బుతుకులేదని !! 663

అల్లం వెల్లుల్లి
అబ్బో ఎంతఘాటు
అవిచేయవు లొల్లి
శరీరానికి చేటు !! 664

ఆరోగ్యం అంటే
ఆకుకూరల తిండి
మహాభభాగ్యం అంటే
వ్యాయామమే కదండి !! 665

పాలు పెరుగులు
శరీర బలాలు
పప్పు దినుసులు
ఐరనిచ్చు కణాలు !! 666

నేరుగా పండుతింటే
అది ఆరోగ్యం
ఐస్ లోవేసి తాగుతుంటే
అది అనారోగ్యం !! 667

భాదాంలు పిస్తలు
తెలివిని పెంచుతాయి
ఖర్జూర చెర్రీలు
చురుకుగ నిలుపుతాయి !! 668

కలిసుండే నవ్వు
అందరిలో ఆరోగ్యమిచ్చు
కష్టపడే చిరునవ్వు
భోగభాగ్యాలు తెచ్చు !! 669

వదలకు ఎన్నడు
ఆరోగ్య నియమాలు
మరువకు ఎన్నడు
ఆరోగ్య సూత్రాలు !! 670

తాండ్ర చిరంజీవి

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్