ఇంతే ఇంతే ఇంతేనంటూ... ఇంకెంత దూరం..?

రోజూ కనబడే నింగైనా సరే రోజు రోజుకీ నూతనత్వం

రోజూ ఊగే చెట్టే అయినా ఊపు ఊపులో ఉత్సాహం

నిత్యం తాకే గాలే అయినా నిమిషనిమిషానికో విచిత్రగానం

దినదినమొచ్చే దినకరుడిచ్చే కిరణాల్లో కొంగొత్త దృశ్యం

దాహం తీర్చే నీరేగాని దాగున్నరుచులెన్నెన్నో

ఇంతే ఇంతే ఇంతే నంటూ ఎంతైనా చూపిస్తుంది

చూసే కళ్ళే నీకుంటే లోకంలో ప్రతిదీ వింతే

నేర్చుకునే ఆశే ఉంటే నేర్పేందుకెపుడూ ముందే

నిరాశలో కూరుకుపోతే నిను బయటికిలాగే ఈ ప్రకృతి మందే

గడ్డపారతో తవ్వేస్తుంటే గడ్డిపరకవై బదులిస్తావు

గడ్డం పెంచి నే విలపిస్తుంటే గడ్డ పెరుగువై ఊరిస్తావు

నీ శృతికై ఎదురే చూస్తే సుప్రభాతమై వినిపిస్తావు

వింతైనా జాగృతి నీవు ఎంతైనా ప్రకృతి నీవు

ఇంతే ఇంతే ఇంతే నంటూ ఎంతైనా చూపిస్తుంది

కొంచెం కొంచెం ఇంకొంచెం అంటూ ఎందాకైనా తీసుకెళ్తుంది

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్