⚡⚡ మెరుపులు ⚡⚡విజయ చిహ్నాలు

⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————

గాయాలు చేతులకు
శ్రమకు ఆయుధాలు
కిరీటాలు తలకు
విజయ చిహ్నాలు !! 504

పైసలతో కొనలేము
హృదయంలో అభిమానము
సైగలతో చేయలేము
దేవునికి విజ్ఞాపనము !! 505

నేర్పును జీవితాన్ని
అనుభవజ్ఞుల మాటలు
వదలద్దు మార్గాన్ని
దారిచూపు బాటలు !! 506

శుభాకాంక్షలు తెలిపి
ఆశీర్వాదం ఇచ్చినారు
అనుభవాలను తెలిపి
బ్రతుకు నేర్పినారు !! 507

మాటలతో చెప్పలేను
మదిలోని సంతసాన్ని
రాతలతో చెప్పలేను
దాగివున్న నిజాన్ని !! 508

అనుకరించుటకు మీరు
గిరిగీసిన హద్దులు
పాటించుటకు మీరు
మాటతప్పని బద్దులు !! 509

మాటలకు దిగులుచెంది
ఒంటరిగా నలిగితిని
దీవెనలను పొంది
చిరుదివ్వెగా వెలిగితిన !! 510
తాండ్ర చిరంజీవి

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్