⚡⚡ మెరుపులు ⚡⚡ అమ్మ- నాన్న

⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————

అమ్మకు నవమాసాలు
పురిటి నొప్పులు
నాన్నకు బ్రతికినన్నాల్లు
ఒంటి నొప్పులు !! 837

నాన్న నలిగిపోతడు
అవమానాలన్నింటిలో
నాన్న ఇబ్బందిపడతడు
కష్టాలన్నింటిలో !! 838

నాన్న దుఃఖాన్ని
కడుపులోనే దాచుకుంటడు
నాన్న బాధల్ని
గుండెలోనే దిగమింగుకుంటడు !! 839

నాన్నకు ఎపుడు
పిల్లలపై ధ్యాస
పిల్లలు పుట్టినపుడు
ఒదలనని చేశాడుబాస !! 840

నాన్న తోడుంటే
కొండంత బలం
నాన్న లేకుంటే
ఇల్లు ఎండినపోలం !! 841

పిల్లల భవిష్యత్తుకు
తహతహ లాడుతడు
వారి ఎదుగుదలకు
తలతాకట్టు పెడతడు !! 842

నాన్న సంతోషాలను
మనతో పంచుకుంటడు
నాన్న దుఃఖాలను
ఎదలోనే దాచుకుంటడు !! 843

నాన్న ముందుండి
కార్యం జరిపిస్తడు
నాన్న అడ్డముండి
కష్టాలను తొలగిస్తడు !! 844

నాన్న వుంటే
ఇంట్లో పులివున్నట్లు
నాన్న లేకుంటే
చలికూడ చంపుతదన్నట్లు !! 845

అమ్మ పేరుమీద
రచించారు ఎన్నోబుక్కులు
నాన్న పేరుమీద
మిగిలేవి హక్కులు !! 846

నాన్న ఎంతపనిచేసినా
అమ్మకన్న తక్కువంటం
ఎవరన్న కొట్టినా
"అమ్మా" అనేఅంటం !! 847

నాన్న బరువుమోసే
మునగని పడవ
అమ్మ నీటినిమోసే
పగలని కడవ !! 848

ఇంటికి ఇద్దరు
రెండు కండ్లు
కలిసి వారిద్దరు
అడ్డుకుంటరు వడగండ్లు !! 849

మాతా పితలకు
వందనాలు..
జన్మనిచ్చిన తలిదండ్రులకు
అభివందనాలు.. !! 850
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్