నువ్వు లేని ఈ క్షణాన…

ఇంతకు ముందు

ఒక్కడినై… ఒంటరినై నడిచేందుకెప్పుడూ భయపడలేదు

నీతో కలిసి నడిచినన్నాళ్ళు…

నాకు నేనే గుర్తులేను

నువ్వే నేననుకున్నాను

భయం అంటేనే తెలియలేదు

బహుశా నువ్వున్నచోట అది ఉండలేదేమో

నువ్వు లేని ఈ క్షణాన…

ఒక్కడినే నడవాలంటే భయంగా ఉంది

నన్ను నేను గుర్తుపట్టలేకుండా ఉన్నా

అయినా వెతుకుతున్నా నేనెక్కడున్నానోనని

ఎక్కడైనా దొరికే అవకాశం ఉండొచ్చని

నాకు నేనే తెలియడం లేదు…

నీతో లేనని భాదనో

నువు లేవని భయమో

నిత్యం నీ ధ్యాసలోనే ఉంచుతుంది

ఒక్కన్నే నడవడానికి

ఒక్కన్నై నడవడానికి ఇంత తేడా ఉంటుందని నాకు తెలియలేదప్పుడూ

ఒక్కన్నే నడిచినప్పుడు నాతో ఎవరూ లేరనే చిన్నలోటు, అది పెద్దగా కష్టమనిపించలే

కాని  ఒక్కన్నై నడుస్తుంటే నాతో నీ ఙ్ఞాపకాలు కూడా ఉన్నాయి ఇది చాలా కష్టంగా ఉంది సుమా…

Comments

Popular posts from this blog

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్