⚡⚡ మెరుపులు ⚡⚡ సాయమొక్కటి చాలు

⚡⚡ మెరుపులు ⚡⚡

ఉదయం చూడని
హృదయం వ్యర్థం
ఉత్సాహంగా పాడని
స్వరపేటిక వ్యర్థం !! 606

మేడలు అద్దాలుకావు
రాయితో పగలడానికి
గోడలు కాగితాలుకావు
చేతితో చింపడానికి !! 607

సాయమొక్కటి చాలు
నీతిగ బతికినందుకు
గాయమొక్కటి మేలు
తిరిగితప్పు చేయనందుకు !! 608

దోచి పెట్టెందుకు
రాశులు వుండాలి
పంచి పెట్టెందుకు
పైసలు వుండాలి !! 609

నువ్వెత్తే పిడికిలి
దున్నే నాగలవ్వాలి
ముగ్గుసే ముంగిలి
హితభోద నేర్పాలి !! 610

పోయిన దొరుకుతది
కష్టపడ్డ సొమ్ము
ఇష్టం అయినది
కష్టకాలమందు అమ్ము !! 611

రాజులు పాలించారని
గాజులపై చరిత్రల్లేవు
రాజులు పోయారని
బతుకుల్లో మార్పుల్లేవు !! 612

ఉద్దండ పిండమంటె
పోటికి రాడు
సత్తిగాడు సన్నగంటె
అసలు ఊరుకోడు !! 613

నీరుగారోద్దు ఎపుడు
నీరుత్సాహంతో ఉన్నా
పొంగిపోవద్దు ఎపుడు
ఉత్సాహంతో ఉన్నా !! 614

మాటవినని మనిషి
లేకున్న ఒక్కటే
తీసుకుంటాడు మనిషి
ఎప్పటికైన నిర్ణయమొక్కటే !! 615

మనసు మంచిగుంటే
నయనం నాట్యమాడుతది
పాత్ర మంచిగుంటే
అభినయం కొట్టస్తది !! 616

గాలిలో మేడలు
స్థిరము కాదెపుడు
కలలో జాడలు
నిజము కాదిపుడు !! 617

ఏపనికి రానివాడు
కొరకరాని కొయ్య
తెలివి లేనివాడు
ఉండివ్యర్థం రయ్య !! 618

ఆకలి తీరదు
అడుక్కు తింటే
బాధ తీరదు
వదులు కుంటే !! 619

ఇల్లంతా ఊడ్చిన
చీపురు మూలకే
వ్యర్థాలను పూడ్చిన
వాసనంత మనిషికే !! 620

చెప్పులు బయటనే
ఊరంత తిరిగిన
బతుకంత బయటనే
ఎనగర్ర విరిగిన !! 621

కాల్చే కాడు
కాయం ఇయ్యదు
జాజిరి ఆడు
జీవం పొయ్యదు !! 622
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్ .

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్