*అమ్మ ...సృష్టికి రక్షకకవచం*
*అమ్మ ...సృష్టికి రక్షకకవచం*🧑👸
****...****
బింగిదొడ్డి వెంకటేష్,
ననుగన్న మాయమ్మా..
ననుపెంచిన మాయమ్మా...
నాజన్మ మర్మమేమి అనురాగపు ముద్దుగుమ్మా
నేెనుగన్న నాముద్దులకొడుకా
నేపండించిన మురిపాల పూదోటా
పురుడుపోసిన తొలినాడే చెప్పా మతిమరుపు మైనపుముద్దా
తుమ్మమొద్దువోలే కదలకమెదలకుండక
కుంచెపట్టి చిత్రించడమే
కలంపట్టి సృష్టించడమే
గానించి నృత్తించడమే
అనురాగాన్ని లాలించడమే
ఆనందాన్ని పంచడమే
అలుపెరుగక పయనించడమే
నినునమ్మిన బతుకుల్లో వెలుగులు పూయించడమే
యెంతెదిగినా...నాపసిబాలుడా
జీవితమే బొమ్మలాట
ఆడుకో నీకనువైనచోట
భంగపడకు నీవెచ్చోటా
బాధ్యతతో నడుచుకో ప్రతిచోటా
ఎల్లవేళలా.. రక్షకకవచమై నేనుంటా.
( *మాతృదినోత్సవవేళ పాదాభివందనంతో అమ్మలందరికీ అంకితం* )
🌹🌹🙏🌹🌹
Comments
Post a Comment