ఓ పిల్లా.. ఓ మాట

పల్లెటూరి పిల్లగాని ప్రేమ ప్రపోజల్

ఓ పిల్లా…….

ఓ మాట అడుగుత జెప్పు..

నన్ను ఏరుకునే, కోరుకునే అవకాశం అందిస్త,

ఆలస్యం చెయ్యకుంట అందుకుంటవా చెప్పు…

oopilla final

ఇరవయ్యేండ్లు నిన్ను మీ అమ్మ చూసుకున్నట్లు,

ఇంకో అరవయ్యేండ్లు నేను చూసుకుంట నిన్ను.

ఉంటవా నాతోటి జెర ఆలోచించి చెప్పు..

ఇన్ని దినాల మీ అయ్య ప్రేమనంత కలిపి,

ముద్దగ చేసి నీ నోటికందిస్త ఒట్టు.

వస్తవా నాతోడుగ ఒక్కమారు చెప్పుచాలు.

ఇష్టమని చెప్పి విడిచిపెట్టి పోను నేను.

కష్టమచ్చిన్నాడు కండ్లల్ల పెట్టుకుంట,

సుఖమైనా, దుఖమైనా నీతోనే పంచుకుంట.

పండుగయిన, పస్తులున్న నీతోటే నేనుకూడ,

పరమాన్నమొ, పచ్చిపులసో నీకిచ్చే నేను తింట.

నడుస్తవా నాతోని నిర్మొహమాటంగ చెప్పు..

అది లేదు, ఇది లేదని లేనివి వెతకబోకు,

అట్లగాదు, ఇట్లగాదు అని అడ్డమైన సాకులు చెప్పకు.

సై అంటే సగమవుదాం, సక్కగ ఒకటే జెప్పు..

డొంక తిరుగుళ్ళు వద్దు, దొడ్డిదారులు అసలే వద్దు,

అయ్యవ్వలకి జెప్పి ఒక్కటైపోదాం.

అందరితో కలిసి ఆనందంగా ఉందాం.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్