పట్టువదలని విక్రమార్కుడు
ఉభయ గోదావరి జిల్లాల భగీరదుడు కాటన్ దొర సంకలనానికి ఈ కవిత.
అంశం : పట్టువదలని విక్రమార్కుడు
ప్రక్రియ : మెరుపులు
పేరు : తాండ్ర చిరంజీవి
ఊరు : ఖిలా వరంగల్ , పడమర కోట
జిల్లా : వరంగల్ అర్భన్ , తెలంగాణ
సెల్ : 9959180762.
మెరుపులు
—————
రైతులబాధలు చూసిన
హృదయమున్న మనిషి
ప్రాజెక్టుకట్టుటకు అడుగేసిన
కాటన్ దొర గొప్పమనిషి !!
వృధాగా పోనియ్యలేదు
నీళ్లను ఆభగీరదుడు
ప్రాజెక్టుకట్టెవరకు నిదురపోలేదు
కార్యోన్ముకుడు ఆధీరుడు !!
ఉభయగోదావరి జిల్లాలు
నిండుకుండలుగా మారాయి
కరీఫ్ రబీ ఎన్నోపంటలు
బహుబాగా పండాయి !!
మనసున్న కాటన్ దొర
పరాయైన మనవాడే
ఆంధ్రకేతలమానికం ఔర హృదయాలు దోచినాడే !!
హామిపత్రం :
——————
ఈ కవిత నా సొంతము. దేనికి అనుకరణ కాని అనుసరణ కాని కాదు.
తాండ్ర చిరంజీవి.
Comments
Post a Comment