జీవ స్వరం

బాలసుబ్రమణ్యం గారి e సంకలనానికి రాసినది ఈ కవిత

అంశం : జీవ స్వరం
ప్రక్రియ : మెరుపులు
పేరు    : తాండ్ర చిరంజీవి
ఊరు   : ఖిలా వరంగల్ , పడమర కోట
జిల్లా    : వరంగల్ అర్భన్ , తెలంగాణ

మెరుపులు
——————

తేనేకంటే తియ్యనిది
బాలుగారి కమ్మనిస్వరం
తెలుగువారికి పెన్నిది
బాలుగారే మనకువరం !!

జీవముంది బాలుగారిస్వరానికి
మళ్ళిమళ్ళి వినాలనిపిస్తుంది
క్రమశిక్షణుంది వారిజీవితానికి
అనుసరించాలని అనిపిస్తుంది !!

ఎన్నెన్నో స్వరాలను
అవపోసన పట్టాడు
అవలీలగ పాటలను
పాడటం నేర్చుకున్నాడు !!

ఒదిగినట్టిజీవితం బాలుగారిది
ఠీవిగుండు వారుకూర్చున్నసభ
చరితార్థజీవితం వారిది
జనాధరమెండు పాటపాడినసభ !!

హామిపత్రం :
——————
ఇది నా సొంత రచన. దేనికి అనువాదం కాని అనుసరణ కాని కాదు.బాలుగారి సంకలనానికి ప్రత్యేకంగా రాసినది.


తాంఢ్ర చిరంజీవి.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్