మండే నిప్పురవ్వ దాశరథి
దాశరథి గారి 96 వ జయంతిని పురస్కరించుకొని రాసినది ఈ కవిత
అంశం : మండే నిప్పురవ్వ దాశరథి
పేరు : తాండ్ర చిరంజీవి
ఊరు : ఖిలా వరంగల్ పడమర కోట
జిల్లా : వరంగల్ అర్భన్
చరవాణి : 9959180762.
చిన్నగూడురులో జన్మించి
సాహిత్యానికి వెలుగయ్యాడు
చైతన్యవంతమైన కవితలురచించి
సమాజాన్ని మేల్కోలిపాడు !!
జైలుగోడలపై పద్యాలనురాసిన
దాశరథి ఒకధీరుడు
నిజాంపాలనను ఎదిరించిన
పఠిమగల పోరాటయోధుడు !!
కేంద్రసాహిత్య అహార్డుగ్రహిత
దాశరథి కృష్ణమాచార్యులు
ఎప్పటికుంటుంది వారిచరిత
వారెందరికో గురుతుల్యులు !!
పద్యశైలితో రచనలుచేసిన
పుణ్యపురుషుడు దాశరథి
పోరాడుటకు ప్రోత్సహించిన
సంకల్పభగీరధుడు దాశరథి !!
హామిపత్రం :
——————
ఇది నా సొంతరచన. దేనికి అనువాదం, అనుకరణ కాని కాదు. దాశరథి జయంతి కొరకు మాత్రమే రాసినది. ఎక్కడా పరిశీలనలో కూడ లేదు. ప్రచురణకు స్వీకరించగలరు.
తాండ్ర చిరంజీవి.
Comments
Post a Comment