* మానవత మెరుపులు *

* మానవత మెరుపులు *
—————————————

మానవత్వం లేని
మనిషి ఎందుకు
మంచి మనసులేని
మనిషి బ్రతుకెందుకు !! 866

కష్టాల్లో ఉన్నవారికి
మానవత్వం చాటన్నా
నీయొక్క జీవితానికి
అదేమంచి మేలన్నా !! 867

కొంటే దొరికేదికాదు
మంచితనం అనేది
అజ్ఞానులకు అర్థంకాదు
మానవత్వం అనేది !! 868

కులాల మాటెత్తకు
మానవత్వం ముందు
మతాల మాటెత్తకు
మంచిపనుల ముందు !! 869

చేయిచేయి కలిపి
చెలిమితోడ బ్రతుకుదాం
జీవితాలు మలిచి
మంచిచేసి బ్రతుకుదాం !! 870

డబ్బుకు విలువలేదు
మానవత్వం ముందు
హోదాకు చోటులేదు
మంచితనం ముందు !! 871

మానవత్వం కులంగాదు
దాహమేస్తే నీళ్ళిస్తుంది
మానవత్వం మతంకాదు
ఆకలేస్తే అన్నంపెడుతుంది !! 872

కరోనా వచ్చింది
మానవత్వం పెరిగింది
వలసల ఆకలితీర్చింది
నేనున్నానని చెప్పింది !! 873

మానవత్వం పరిమళిస్తే
దేశసంబంధాలు హెచ్చు
ఈభావం పెంపొందిస్తే
మంచిపేరు వచ్చు !! 874

కులగోడలు కూల్చాలి
మానవత్వం చూపి
మతగడీలు పేల్చాలి
హెచ్చుతగ్గులు బాపి !! 875

మహారాజైన సైనికుడే
మానవత్వం లేకపోతే
అధికారైన బిచ్చగాడే
మానవత్వం చూపకపోతే !! 876

కరోనా పుట్టింది
మనిషిని చంపింది
మానవత్వం లేచింది
మనిషిని బ్రతికించింది !! 877

జీవితానికి ఒకపేజి
చేసిన సాయం
మానవత్వం చూపనిపేజి
పొందిన గాయం !! 878

కనిపించని కరోనాకు
మనిషి భయపడుతుండు
మానవత్వం చూపేందుకు
మనిషి తలవంచుతుండు !! 879

మానవత్వమే ఆయుధం
మనిషిని బ్రతికించుటకు
శుభ్రతే ఆయుధం
కరోనాను చంపుటకు !! 880

ఆవిరయ్యే జీవితానికి
ఆరాటం ఎందుకు
మానవత్వంలేని మనిషికి
పోరాటం ఎందుకు !! 881

పోలీసుజవాన్ కాపలాయే
రక్షించే మానవత్వం
వైద్యులసపాయిల సేవయే
ప్రాణభిక్ష మానవత్వం !! 882

మానవత్వం మందు
మంచిని బ్రతికించుటకు
జనులువేయాలి చిందు
చెడును తొలగించుటకు !! 883

ఐక్యతరాగం వినిపిద్దాం
అందరం ఒకటై
మానవత్వాన్ని బ్రతికిద్దాం
మనుషులం ఒకటై !! 884

తాండ్ర చిరంజీవి

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్