నమ్మకమైన బంటు
మాన్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి జయంతిని పురస్కరించుకొని రాసినది ఈ కవిత.
అంశం : నమ్మకమైన బంటు
ప్రక్రియ : మెరుపులు
పేరు : తాండ్ర చిరంజీవి
ఊరు : ఖిలా వరంగల్ ,పడమర కోట
జిల్లా : వరంగల్ అర్భన్ , తెలంగాణ
చరవాణి : 9959180762.
————————————————
తెలుగువారి ఖ్యాతి
వెంకయ్యనాయుడు
వారికిలేదెన్నడు భీతి
మంచి పరిపాలకుడు !!
ప్రసంగాలలో కురిపిస్తడు
తెలుగుపై మక్కువ
ఉన్నతవిద్యా పట్టాలుపొందాడు
చదువంటే ఇష్టంఎక్కువ !!
నమ్మకమైన కార్యకర్తై
పార్టీని నడిపించాడు
ఇల్లాలికి మంచిభర్తై
కుటుంబానికి పేరుతెచ్చాడు !!
తెలుగు సాంప్రధాయం
వెంకయ్య పంచెకట్టు
వారిదిమంచి అభిప్రాయం
నుదుటపెట్టరు బొట్టు !!
రాజకీయంలో రాఠుతేలిన
అనుభవసారుడు
తెలుగువెలుగుకు నడుముకట్టిన
కార్యధీక్ష పరుడు !!
వెంకయ్యకు మంచితనంతో
ఉపరాష్ర్టపదవి వరించింది
తనజీవితం సహనంతో
కష్టాలు భరించింది !!
ఎందరికో వెంకయ్యనాయుడు
ఇలలో ఆదర్శమూర్తి
భువిపై ఆనాయకుడు
పొందాడు ఘనకీర్తి !!
హామిపత్రం :
—————
ఇది నా సొంత రచన. దేనికి అనుకరణ, అనుసరణ కాదు. ప్రత్యేకముగా వెంకయ్యనాయుడు జన్మదినం గూర్చి రాసినది.
తాండ్ర చిరంజీవి.
Comments
Post a Comment