అవని ఘోశిస్తుంది
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాసినది ఈ కవిత
అంశం : అవని ఘోశిస్తుంది
ప్రక్రియ : మెరుపులు
పేరు : తాండ్ర చిరంజీవి
ఊరు : ఖిలా వరంగల్ , పడమర కోట
జిల్లా : వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
** మెరుపులు **
———————————
జనాభాపెరగడం ప్రమాదం
కూడుగుడ్డకు కూసోనిఏడ్వాలే
తక్కువజనాభా అవనికిమోదం
ముందుతరాలకు భరోసాఇవ్వాలే !!
జనాభా పెరిగితే
ఆహారపదార్థాలు కలుషితం
జనాభా తక్కువైతే
అవనినేర్పిస్తది హితం !!
బంధాలకు విలువలేదు
జనసంఖ్య పెరుగుటతో
ధనాన్ని దాచుటలేదు
దుబారా ఖర్చులతో !!
అధికజనాభా పెరుగుట
అవస్థలు తప్పవు
అవనిశక్తి విరుగుట
వైరస్ బాధలు తప్పవు !!
హామిపత్రం :
——————
ఇది నా సొంత రచన. దేనికి అనువాదం కాని అనుసరణ కాని కాదు. ప్రపంచ జనాభా దినోత్సవం కొరకు రాసినది. స్వీకరించగలరు.
సంతకం
————
తాండ్ర చిరంజీవి.
Comments
Post a Comment