కత్తిలాంటి పోలిసన్నకు సెల్యూట్ ... !

కత్తిలాంటి  పోలిసన్నకు సెల్యూట్ ... !
——————————————————

కరోనా మహామ్మారి
కాలయముడై..
కాలకూఠ విషాన్ని కక్కుతుంటె
కాలు కదప కుండ
కఠిన నియమాలతో...
కారు చీకట్లను పారదోలడానికి
కార్యోన్ముకుడవై...
కదిలావు కత్తిలా దండువై..
కనబడిన వారికి జాగ్రత్తలు చెబుతూ..
కఠినంగా నియమాలు అనుసరిస్తూ..
కంటికి రెప్పలా ప్రాణాలు కాపాడుతూ..
కలియుగ దైవం అనిపించుకున్నావు !!

కుటుంబాలను విడచిపెట్టి
కన్నపిల్లలకు దూరముండి
కరోనా నిరోధానికి..
కత్తుల వలె లాఠిలు పట్టి
కంగారుల వలె పరుగెత్తుతూ
కంటి నిదురను చంపుకొని
కాసుకు కూర్చున్నావు పోలిసన్నా !!

కలిగిందే తిన్నావు
కదలకుండ వున్నావు
కుట్టినా దోమలను చంపుకుంటూ..
కారు చీకట్లలో పడుకున్నావు
కరోనా రోగానికి జడియక
కంచెలను వేశావు
కాకి వేగం పుంజుకొని
కారడవిలో తిరిగినట్లు...
కార్లల్లో తిరుగుతూ..
కఠినంగా ప్రజలతో వ్యవహారించావు !!

కమ్మనైన మనసు నీది
కరోనాను అంతమొందించు ఆలోచన నీది
కవ్వింపులకు తావులేదు
కరోనాకు బతికే హక్కు లేదు
కార్యశీలుడా మా పోలిసన్న " సెల్యూట్ " !!


తాండ్ర చిరంజీవి
ఖిలా వరంగల్ , పడమర కోట
వరంగల్ అర్భన్ జిల్లా
సెల్ : 9959180762.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్